Thursday 24 September 2015

మక్కా మసీద్, హైదరాబాద్

సిఫార్సు చేసినది

హైదరాబాద్ లో ఉన్న అతి పురాతన మయిన మాస్క్ గా మాత్రమే కాకుండా దేశంలో నే అతి పెద్దదైన మాస్క్ గా ఈ మక్కా మసీద్ ప్రాచుర్యం పొందింది. ముస్లిం ల కి ఆధ్యాత్మిక ప్రాధాన్యత ప్రదేశం గా నే కాకుండా, అత్యుత్తమ చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రాంతం కూడా. ఈ మసీదు కి రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పిస్తోంది.

ఈ మసీదు అత్యధికంగా పర్యాటకులని ఆకర్షించడానికి గల కారణం అత్యంత ప్రాచుర్యం పొందిన చార్మినార్ మరియు చౌమహల్లా పాలసు లకి దగ్గరగా ఉండడం. 16 వ శతాబ్దంలో మొహమ్మద్ ఖులీ ఖుతుబ్ షా ఈ మసీద్ నిర్మాణం చేపట్టారు. మక్కా నుండి తీసుకువచ్చిన మట్టితో తయారుచేయబడిన ఇటుకలతో ఈ మసీదు నిర్మాణం జరిగింది. మధ్యలో ఉన్న కమానుని ఈ ఇటుకలతోనే నిర్మించారు.

ఈ మసీదు అక్షరాలా, లాంఛనప్రాయంగా ఖులీ ఖుతుబ్ షా నిర్మించిన తన సామ్రాజ్యానికి కేంద్రబిందువు. ఈ మసీదు లో ఉన్న ముఖ్య ఆకర్షణ ఇక్కడ వరండా. ప్రవక్త మొహమ్మద్ గారి తల నుండి వెంట్రుక ఇక్కడ భద్రపరచబడినదని నమ్మకం.

No comments:

Post a Comment